ప్రభుత్వ పౌష్టిక ఆహార లోపం వలన గిరిజన పిల్లలు బలి!!

అల్లూరి సీతరామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, అరకు పార్లమెంట్ ఇంఛార్జ్ డా వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు.. కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ. హెచ్.అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పాడేరు మండలం, బొంజంగి విలేజ్, కించూరు పంచాయతీ, పూజారి: మత్యరాజు, భార్య పూజారి శాంతమని కుమారుడు, పూజారి రాంప్రసాద్ ను తలార్ సింగ్ సి ఏ హెచ్ స్కూల్ లో 6 వ తరగతి చదవడం జరుగుతుంది… అయితే స్కూల్ లో జ్వరం రావడం జరిగింది. విషయం తెలుసుకున్న, తల్లదండ్రులు హుటాహుటిన, స్కూల్ కి వెళ్లి బాబు నీ పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్చడం జరిగింది. అలాగే బాబు రాంప్రసాద్ పరిస్తితి క్రిటికల్ గా ఉంది, అని వైద్యులు చెప్పడం జరిగింది. అలాగే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి అనేది పేరుకే జిల్లా ఆసుపత్రి అక్కడ సరైన సదుపాయాలు లేక మెరుగైన వైద్యం కొరకు వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రి కి పంపించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో గిరిజనులకు, సామాన్యులకు సరైన సదుపాయాలు లేక కేజీహెచ్ ఆసుపత్రి కి పంపించడం చాలా బాధాకరం అని మండి పడ్డారు. ప్రజా ప్రతినిధిలు అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను, మబ్బు చేస్తున్న ప్రజా ప్రతినిధిలు ఎక్కడ అని అవేదన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టడమే ఆ పిల్లలు చేసిన నేరమా అని అడిగారు. పిల్లలకు ఈ వైసీపీ ప్రభుత్వం పౌష్టిక ఆహారం అందించడంలో పూర్తిగా విఫలం అయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏ.పి ఆరోగ్య మంత్రి విడుదల రజినీ గారికి విన్నపం: మీరు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా ఆలోచించి అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా మీరు ముందుకు వెళ్లాలని అలాగే మధ్య తరగతి కుటుంబంలో వెలుగులు నింపే విధంగా మీ పరిపాలన ఉండాలి కాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని తెలిపారు. అలాగే కోటగుల్లి భాగ్యలక్ష్మి మీరు అడగవలసింది సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని కాదు, ప్రజలకు కావలసింది, మెరుగైన వైద్యం, విద్య, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవి రెండు అమలు కాలేదు. కచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా విద్య వైద్యం అనేది సంపూర్ణంగా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. తక్షణమే పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి గారు స్పందించాలని, పిల్లలకు ఏదో తెలియని విషజ్వరంతో గురుకుల విద్యార్థులు మరణిస్తున్నారు అని తక్షణమే విడుదల రజినీ గారు స్పందించాలని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరగలేని మరుక్షణం జనసేన పార్టీ తెలుగుదేశం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.