ఓటమి భయంతోనే అంబటి అరెస్టులకు పాల్పడుతున్నాడు: గాదె

గుంటూరు: మంత్రి అంబటి రాంబాబు అక్రమాలు.. అరాచకాలపై యుద్ధం చేస్తున్నందుకే అరెస్టులు చేస్తున్నారని.. దీని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.. అచ్చం పేట మండల పర్యటనలో భాగంగా సత్తెనపల్లినియోజకవర్గ జనసేన కార్యాలయానికి వచ్చిన గాదె వెంకటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి రాంబాబు నాపై వ్య్వక్తిగతంగా కక్ష పెంచుకుని నన్ను భయపెట్టాలని చూస్తున్నారని, మీలాంటి ఉడత ఊపులకు బయపడేధీ లేదని.. సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలకు కేంద్రబిందువుగా అంబటి రాంబాబు ఉన్నారని.. అక్రమాలపై జనసేన పార్టీ పోరాడుతుంటే అంబటి గుండెల్లో వణుకు పుడుతుందని, అందుకే కావాలని నన్ను అరెస్ట్ చేయాలనీ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నదని గాదె అన్నారు.. సత్తెనపల్లిలో గంగమ్మ దంపతులకు జరిగిన అన్యాయాన్ని .. నిషేదంలో ఉన్న లక్కీడ్రా పేరిట కోట్ల రూపాయలు వసులు చేసిన విషయంలో జనసేన పోరాడుతున్నందుకే అంబటి రాంబాబు అరెస్టులకు తెగబడుతున్నడని గాదె అన్నారు. అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేవని రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజానీకం నిన్ను తరిమికొట్టడానికి సిద్ద్దంగా ఉన్నారని.. నీలాంటి బడా చోర్ లను ఎదుర్కోడానికి జనసేన సిద్డంగా ఉందన్నారు.. అంబటి రాంబాబుకి ఏమాత్రం దమ్ము దైర్యం ఉన్నా బహిరంగ చర్చకు రావాలని … గాదె సవాల్ విసిరారు.