కాలుష్యం కోరల్లో గిరిజన కాలనీ వాసులు

  • కాలుష్యం కోరల్లో బ్రతికి ఉండడానికే పోరాటం చేస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,పైనాపురం, దేవరదెబ్బ, గిరిజన కాలనీ వాసులు
  • పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం రేడియేషన్తో చర్మ వ్యాధులు
  • ఒక గంట నిలబడితే గాలి పీల్చడం కూడా కష్టం. తల స్నానం చేసి బయటకు వచ్చి నిలబడితే10 నిమిషాలు మల్లీ దుమ్ము కొట్టుకుపోతుంది

సర్వేపల్లి నియోజకవర్గం: గిరిజన కాలనీ వాసులు కాలుష్యం కోరల్లో చిక్కుకుని బ్రతికి ఉండడానికే పోరాటం చేస్తున్నారని జనసేన నాయకులు గునుకుల కిషోర్ పేర్కొన్నారు. యాష్ పాండ్ల వలన తమ జీవితాలు దుర్బరం అవుతున్నాయని గిరిజన నాయకుల సమాచారం మేరకు గురువారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిడ్డలకు వస్తున్న చర్మవ్యాధులను కాలుష్యం బారిన పడిన స్థానికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బ్రతికి ఉండడానికి పోరాటం చేస్తున్నారు ఇక్కడ గిరిజనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే దుమ్ము దూళి తో పర్యావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. మనుషుల ఆయుర్దాయం తక్కువ. మొక్కలు కూడా ఎదిగే పరిస్థితి లేదు. జీవనాధారమైన చెరువు హాష్ఞ పాండ్తో నిండిపోయింది. చిన్న బిడ్డలకు ఒళ్లంతా కురుపులు ఏ మందు వాడినా తగ్గని లేదు. గడప గడపకి వచ్చిన కాకాని గారు గిరిజన కాలనీ మొదట్లోనే వెనుతిరిగాడు. స్థానికులంతా ముట్టడించడంతో సమస్యలు అడిగి సైలెంట్ అయిపోయాడు. దాదాపు 80 గడపలు 300 మంది నివసిస్తున్న ఈ ప్రాంత వాసులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు ఇప్పిస్తే వెళ్ళేందుకు వీరందరూ సిద్ధంగా ఉన్నారు. తమ పార్టీకి ఉపయోగపడతారని, పెత్తందారికి వ్యవస్థకు తోడు ఉంటారని ఇళ్ళు ఉన్న వారికే ఇచ్చే బదులు ఇటువంటి వారికి ఇల్లు ఇస్తే ఒక సముదాయాన్ని కాపాడిన వారు అవుతారు. సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం.. సమస్య పరిష్కరించి వీరికి పౌనరావాసం కల్పించే వరకు కూడా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఆమీన్, ఖలీల్, కేశవ, మౌనిష్ వర్షన్ తదితరులు పాల్గొన్నారు.