జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన రైతులు

*మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ

అరకు నియోజకవర్గం గన్నెల పంచాయతీ పరిధిలో గా అమల గూడా గ్రామంలో శనివారం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి జనసేన పార్టీ జనసైనికులు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల గిరిజన రైతులతో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మాదల శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాదల శ్రీరాములు, మండల నాయకులు అల్లంగి రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన 80 మంది కౌలు రైతుల కుటుంబానికి అండగా నిలిచి ఆయన కష్ట జీతం అయినటువంటి 5 ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మ హత్యకు గురైన కౌలు రైతు కుటుంబానికి భరోసాగా నిలబడుతూ నిధులు కేటాయించడం గర్వించ వలసిందే నా ఇటువంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించుకోవాలని గిరిజన రైతులను సూచించారు రాష్ట్రంలో కౌలు రైతులు మరణించిన కుటుంబానికి నేటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం రైతులను మోసం చేసినట్లేనని ఇటువంటి ధోరణి వ్యవహరించడం జగన్ రెడ్డి పాలనలో మనం చూస్తున్నామని కావున రానున్న రోజుల్లో రైతులు అందరు కలిసి జగన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు ప్రజల పక్షాన నిలబడుతున్న. మన జనసేన పార్టీకి 2024న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసేందుకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా గిరిజన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అప్పలరాజు తదితరులు గిరిజన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.