గిరిజనులు అంటే చులకన సరికాదు

విజయనగరం జిల్లా మరియు మండలం కొండకరకం పంచాయతీ గ్రామ గిరిజనుల వద్ద గత మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీకి భూమి తీసుకోవడం జరిగింది. సుమారు 15 మంది రైతులకు ఈనాటి వరకు నష్టపరిహారం అందలేదని ఆ గ్రామ గిరిజనులు మూడు సంవత్సరాల నుంచి తరచూ అధికారులను కలుస్తున్నా ఎటువంటి స్పందన లేదు. సోమవారం జిల్లా కలెక్టర్, ఆర్డీవో లను ఆదివాసి జేఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర మరియు ఆదివాసి రాష్ట్ర కార్యదర్శి బురిడీ లక్ష్మణరావు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు దుక్క సీతారాం కలిసి కొండకరకం గ్రామ గిరిజనుల సమస్యలు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని గిరిజనులు అంటే అధికారులకు ప్రజా ప్రతినిధులకు చులకన సరికాదని వాపోయారు. గిరిజనులకు, భూమికి నష్టపరహారం చెల్లించని యెడల వారి భూమిని తిరిగి వారికి అప్పగించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో కొండకరకం గ్రామపంచాయతీ గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.