మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

అరకు: కొసొమకేంద గ్రామం, గసభ పంచాయతీ, డుంబ్రిగుడ మండలం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ప్రజలు మౌలిక సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే నాధుడు లేడు. త్రాగటానికి మంచి నీటి సదుపాయం లేదు, పిల్లల చదువులకి అంగన్వాడీ కేంద్రం లేదు, వైద్య సదుపాయం లేదు. రహదారి నుంచి 2 కిలోమీటర్లు కొండలు ఎక్కి రావాల్సి వస్తుంది అని ఆ గ్రామ ప్రజలు కంట తడి పెడుతున్నారు. విషయం తెలుసుకుని అరకువ్యాలీ జనసేన పార్టీ బృందం కొన్నేడి లక్ష్మణ్ రావు, కొన్నేడి చిన్నారావు, పరాధాని సురేష్, పాంగి పవన్ కుమార్, ముత్తెం ప్రసాద్, అల్లంగి రామకృష్ణ, సంతోష్ కుమార్ సింగ్, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఆ గ్రామానికి సందర్శించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం అని హామీ ఇచ్చారు.