మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో అంబేద్కరుకు ఘననివాళి

మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశాభివృద్ధి కోసం, దేశం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడాలని అనుకొంటారో వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. జనసేన నాయకులు జనసైనికులు కార్యకర్తలు అందరూ అంబేద్కర్ సూచించిన మార్గంలో నడిచి రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి నవాజ్ తదితరులు పాల్గొన్నారు.