ఉత్తమ చిత్రంగా ‘చిచోరే’ కు గౌరవం – ఎమోషనల్ అవుతున్న సుశాంత్ ఫ్యాన్స్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోరే’ సినిమాకు జాతీయ ఉత్తమ అవార్డుల పురస్కారాల్లో గౌరవం దక్కింది. 67 వ జాతీయ అవార్డుల ప్రకటనలో భాగంగా చిచోరే సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో జాతీయ అవార్డు వచ్చింది. దంగల్ లాంటి సంచలన సినిమా తెరకెక్కించిన నితీష్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ, తాహీర్ రాజ్ భాసిన్, నవీన్ పోలిశెట్టి, తుషార్ పాండే తదితరులు నటించారు. ప్రస్తుతం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుశాంత్ సింగ్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన లేకపోయినా ఆయన సినిమాలు బతికే ఉంటాయంటూ సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్టులు షేర్ చేస్తున్నారు.

గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. 34 ఏళ్ల వయసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన చనిపోయి ఏడాది కావస్తున్న అభిమానులు మాత్రం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఇక సుశాంత్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి సినిమాలోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.