జనసేన మండల అధ్యక్షులకు చిరు సత్కారం

పాయకరావుపేట నియోజవర్గ ఇంఛార్జి గెడ్డం బుజ్జి సూచనలు మేరకు మండల అధ్యక్షులుగా నియమితులైన పాయకరావుపేట మండలం యగదాసు నానాజీ, నక్కపల్లి మండలం వెలగా సుధాకర్, యస్ రాయవరం పప్పల శివ, కోటవురట్ల సింగంపల్లి శ్రీను, పాయకరావుపేట పట్టణ అధ్యక్షులుగా నియమితులైన ఆచంట దోరలను పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జి గెడ్డం బుజ్జి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు అందరూ మండల అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన గెడ్డం బుజ్జి, జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబులకు కృత్ఞజ్యతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గెడ్డం కన్నబాబు, జగ్గన్నదొర, పల్లి దుర్గారావు, పవన్, నల్లల రత్నాజి, తుమ్మల గణేష్, పాలపర్తి వెంకటరవి, గణేష్, బుజ్జి, వాసు, వినోద్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.