దామలచెరువులో రంగాకు ఘననివాళి

తిరుపతి జిల్లా, పాకాల మండలం, దామలచెరువు గ్రామంలో, మంగళవారం వంగవీటి మోహన్ రంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు కాపు సంక్షేమ సేన తిరుపతి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు రమేష్ బాబు మారసాని మాట్లాడుతూ వంగవీటి రంగా చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. మరియు‌ అంతేకాకుండా ఆయన ప్రజల గుండెల్లో ఒక దేవుడులా మిగిలి ఉన్నారు. మరియు విజయవాడలో ఎంతోమంది పేదలకు దేవుడిలా ఉన్నారు. ఇప్పటికి వంగవీటి మోహన్ రంగా అంటే విజయవాడలో అన్ని కులాల వారికి ఒక దేవుడు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి చాలా ఘనంగా జరుపుకుంటారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామలచెరువు జనసేన నాయకులు రమేష్ బాబు మారసాని, నాగిరెడ్డి మారసాని, ఆనంద బండారు, చంగల్ రాయల్, దినేష్ రాయల్ పాకాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు గురునాథ్ రాయల్, చిత్తూరు జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ నా సేఫ్ బాలకృష్ణ, ఇంకా జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.