అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన యిర్రింకి సత్యతేజకు సన్మానం

జనసేన పార్టీ మలిదశ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసిన వీరవాసరం మండలం, తోలేరు గ్రామానికి చెందిన జనసైనికుడు యిర్రింకి సత్యతేజ ని జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) అభినందించి, సన్మానించారు. ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన తోలేరు సర్పంచ్ వేండ్ర లీలా వెంకట కృష్ణ, యిర్రింకి రాము మరియు జన సైనికులందరికీ అభినందనలు తెలియజేశారు.