నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళులు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం కెంధ్రంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ స్వాంతంత్య్ర స‌మ‌ర సేనాని సుభాష్ చంద్రబోస్ మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలంటే కేవలం అహింస మార్గం ఒక్కటే కాదని, ఆంగ్లేయుల పాలన నుండి మనకు విముక్తి కావాలంటే మనం కూడా సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నమ్మిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత పౌరుడిగా, మన ఉజ్వలమైన మరియు స్వతంత్ర భవిష్యత్తు కోసం సుభాష్ చంద్రబోస్ అందించిన సహకారాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము. ప్రస్తుత కాలంలో, మనం ఎప్పుడూ కలలు కనే దేశాన్ని సృష్టించడానికి అదే దేశభక్తి మరియు ధైర్యాన్ని నింపగల సుభాష్ చంద్రబోస్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతాజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీదే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరుపున ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు జనసైనికులు. ఈ కార్యక్రమంలో చింత గోవర్ధన్ నాయుడు, తుముల గోవింద, కర్ణేన పవన్ సాయి, వాన కైలాష్, మంతిని వ్యాగ్రీస్, ఇప్పిలి దినేష్, కంటు రాంబాబు, వాన మహేష్, ముంజేటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.