గోపాలపురం జనసేన ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళులు

గోపాలపురం: దేవరపల్లి గ్రామం, యాదవోలు రోడ్డులో మూడు బొమ్మల సెంటర్ వద్ద మంగళవారం సిద్ధ తాతబ్బాయి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 76వ జన్మదినం సందర్భంగా ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు, దేవరపల్లి మండల అధ్యక్షులు కట్నం గణేష్ విచ్చేసి వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ.. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి జాతీయ స్థాయి వరకు ఏదిగి రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని అందిపుచ్చుకునే ప్రయాణం వరకూ ఆయన చేసిన పోరాటాలు పేదలకు చేసిన సహాయాలు ఎనలేనివని అలాంటి నాయకత్వం వస్తే అధికార బలం ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు మనుగుడ కష్టమవుతుందని భావించి, పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆ రోజులు గుర్తు చేస్తూ మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి వ్యక్తి జనసేన పార్టీ స్థాపించి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేశారు. అలాగే ఈరోజు స్వసంత్ర పోరాట యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జన్మదిన సందర్భంగా ఆయనకు పూలమాలవేసి ఘన నివాళులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ పెద్దలు పప్పు రామారావు, గేలం కృష్ణ, దుర్గ, వీరమహిళలు సలాది వేణుమాధవి, కవల సీతారత్నం, జనసేన పార్టీ నాయకులు చప్పటి శివ నాగ ప్రసాద్, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ కాజా మొహిద్దిన్, గంధం అయ్యప్ప, జె కె, సుందర్, సురేష్, బాలు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.