అన్నమయ్య వరద బాధితుల కోసం నిరాహార దీక్షకైనా సిద్ధం

  • రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్

అన్నమయ్య డ్యాం వరద బీభత్సం కారణంగా నిరాశ్రయులైన జల సమాధి అయిన కుటుంబాలకు అండగా నిలబడడానికి గతంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు భరోసా నింపే కార్యక్రమాలు చేయడం జరిగింది. 18 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో బాధ్యులకు అండగా నిలబడే విషయంలో చేతులెత్తేసిన వైనాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ పరిశీలించి పక్కా గృహాలు, డ్రైనేజ్, త్రాగునీటి పైపులైన్, రోడ్లు, స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు. నెలలోపలే పూర్తి చేయాలని వారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఇచ్చిన గడువులో పూర్తిస్థాయిలో కాకపోతే మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిరాహార దీక్షలు కూడా చేస్తామని అతికారి దినేష్ అన్నారు. పులపత్తూరు గ్రామంలో గుడారాలలో నివాసమున్న బాధితులను వారి యోగక్షేమాలను రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకులు అతికారి దినేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల నష్టపోయిన కుటుంబాలను వారే ఆదుకోవాలి లేకుంటే తమ పార్టీ తరఫున వారికి అండగా పూర్తిస్థాయిలో అన్ని అందేంతవరకు మేము ఉంటామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి శ్రీనివాసులు, కొట్టే రాజేష్, సిద్ధవటం సర్పంచ్ ప్రతినిధి బి ఓబులయ్య, ఉపసర్పంచ్ హిదాయత్, మస్తాన్ ఎం నాగరాజు, గుగ్గుళ్ల నాగార్జున, రవి, జనసేన వీరమహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.