జియో 5జి నెట్వర్క్ పనులు నిలుపుదల చేయాలి.. జనసేన డిమాండ్..!

  • ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా పనులు కొనసాగిస్తున్న జియో 5జి నెట్వర్క్ కాంట్రాక్టర్

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండలో మినీ బైపాస్ నందు జియో 5జి అండర్ కేబుల్ వర్క్ జరుగుతుందని, దీనివలన మంచినీటి పైపులు మరియు సిసి రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని స్థానిక ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తెలియపరచినారు. దీనిపై స్పందించిన జనసేన మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ అడగగా జియో5జి నెట్వర్క్ పనులు వలన ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాటిని పూర్తిగా వారే మరమత్తుల చేపట్టి యధావిధిగా ఇవ్వాలని, అదేవిధంగా దీనికి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి డిడి ద్వారా ఇవ్వమని చెప్పినామని సింగరాయకొండ కార్యదర్శి వివరణ ఇచ్చినారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ డిపాజిట్ చేయలేదు, అనుమతులు పొందని కారణంగా ప్రస్తుతం పనులను నిలుపుధల చేసి, అనుమతులు పొందిన తర్వాత పనులు చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు సింగరాయకొండ 10వ వార్డు మెంబర్ ఓలేటి రవిశంకర్ రెడ్డి, 3వ వార్డు మెంబర్ కోటి, 2వ వార్డ్ మెంబర్ విజయ్ కుమార్, సన్నె బోయిన వీరయ్య, ఇరుకుమారి శ్రీకాంత్, కారని సురేష్, మేకల అంకారావు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.