గన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో సంక్షేమం నిల్

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: విజయనగరం జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలకు జనసేన నేత గురాన అయ్యలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యల నగరం విజయనగరం అనే చరిత్ర మన జిల్లాకి ఉందని, అలాంటి జిల్లాకి ఈ నాలుగు ఏళ్ల కాలంలో ప్రభుత్వం విద్యారంగానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగం యొక్క నిధులు విద్యారంగానికే ఖర్చు చేయాలని కోరారు. విద్యా శాఖ మంత్రి జిల్లాలోనే ఉన్నా మన జిల్లా లో విద్య పరిస్థితి ఇంత దారుణంగా వుండడం సిగ్గుచేటు అని అన్నారు. పట్టణంలో ప్రతి చోట వాటర్ ఫౌంటైన్ లు కట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం త్రాగు నీరు ఇవ్వలేక పోవడం ఏంటని విమర్శించారు. వసతి గృహాంలో మూడు వందల మందికి నాలుగు బాత్​రూమ్​లు మాత్రమే వుండటం దారుణమన్నారు.
వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించమని డిమాండ్ చేశారు.
ఎస్ ఎఫ్ ఐ చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఏంటి రాజేష్, ఎల్. రవితేజ, అడబాల వేంకటేష్, ఎమ్. పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కంది సురేష్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.