మంచి వైద్యం కోసం కృషి చేస్తున్న ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

  • పూర్ణచంద్రరావురని పరామర్శించిన పొన్నలూరు, సింగరాయకొండ మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు
  • 5000 ఆర్థిక సహాయాన్ని అందించిన కనపర్తి మనోజ్ కుమార్
  • లక్ష రూపాయలు వరకు ఆర్థిక సహాయాన్ని అందించిన జనసైనికులు
  • ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని చెప్పిన డాక్టర్లు

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, కొండేపి మండలంలో ఇటీవల కాలంలో డిసెంబర్ 31న “మట్టిపల్లి పూర్ణచంద్రరావు” అనే జనసేన పార్టీ జనసైనికుడు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్తు ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ప్రస్తుతం అతను ఒంగోలులో వెంకటరమణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ వెంటనే స్పందించి హాస్పిటల్ కి వెళ్లి, జనసైనికున్ని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి, ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. కొండేపి నియోజకవర్గం నాయకులు మేడా రమేష్ నాయుడు కూడా జనసైనికున్ని పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, డాక్టర్ తో మాట్లాడి, ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, అదేవిధంగా సింగరాయకొండ మండలం అధ్యక్షులు అయినబత్తి రాజేష్ కూడా హాస్పిటల్ వద్దకు వెళ్లి, గాయపడిన జనసైనికున్ని పరామర్శించి, కుటుంబ సభ్యులతో మరియు డాక్టర్లతో మాట్లాడి రావడం జరిగింది. ఇప్పటివరకు గాయపడిన పూర్ణచంద్రరావుకి ఆర్దిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు.