అనుశ్రీ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ చేరికలు

  • కందులు దుర్గేష్ మరియు అనుశ్రీ చేతుల మీదుగా జనసేన జండా స్థూపం, జండా ఆవిష్కరణ

రాజమండ్రి సిటీ: రాజమండ్రి సిటీలో సీతంపేట 40 వార్డు నుంచి పెచ్చేటి ఏసు కుమార్, సింహాచలం, శ్రీను మరియు వారి మిత్రబృందం సుమారు వందమంది సభ్యులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఏసీ మెంబర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కందులు దుర్గేష్ మరియు అనుశ్రీ చేతుల మీదుగా జనసేన జండా స్థూపం, జండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం పార్టీలో చేరిన సభ్యులందరికీ కందులు దుర్గేష్ మరియు అనుశ్రీ చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందని, అన్ని వర్గాల ప్రజలు వైసిపి ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తితో ఉన్నారని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, కార్య దక్షిత సిద్ధాంతాలు నచ్చి మహిళలు, పెద్దలు, యువత జనసేనకు చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా వార్డు పర్యటనలో ప్రజల తమ సమస్యలను వెల్లడిస్తున్నారని ఎక్కడ చూసినా మాకు ఏడాది గడిచిన పెన్షన్లు రావడంలేదని చెబుతున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ చూపించి వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఆఫ్ చేస్తున్నారని, కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అవుతూ ప్రజలను మోసం చేస్తూ ఇంటింటికి వెళ్లి భయపడుతూ పాలన సాగిస్తున్నారని, రాజకీయాలు రబ్ధి కోసం ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నారని రోజుకి సుమారు 700 కోట్లు ఖర్చుచేసి రాష్ట్రాన్ని శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేస్తున్నదని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తలకు భద్రతా భరోసా కల్పించాలనే ఆలోచనతోనే చేపడుతుందని, కార్యకర్తలు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడం కోసం మూడు సంవత్సరాల క్రిందట ఈ అద్భుతమైన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం తీసుకొచ్చిందని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా క్రియాశీల సభ్యత్వం తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వై వి డి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిలు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్నావాసు, సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు, కేల జయలక్ష్మి జనసేన యువనాయకులు బయ్యపునీడి సూర్య మరియు విక్టరీ వాసు, మంచాలు సునీల్, విజ్జన్న సూరిబాబు, నర్సిపూడి రాంబాబు, పటాన్ ఖాన్, కుప్పిలి రాఘవ, హేమ దుర్గా, దుర్గ ప్రసాద్, భీమరాజు, బి ప్రసాద్, మరియు కురుమప్పారావు మిత్ర బృందం బయ్యపు నీడి సూర్య మిత్ర బృందం దుర్గాప్రసాద్ మిత్రబృందం పెచ్చేటి ఏసు కుమార్ మిత్ర బృందం జన సైనికులు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.