పవన్ కల్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు

  • వైసీపీ దాష్టీకాల నుంచి ఐదు నెలల్లో రాష్ట్రానికి విముక్తి
  • జనసేన, టీడీపీ పొత్తుకు క్షేత్రస్థాయిలో ప్రజామోదం
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా తమ పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని, దేశభక్తి, నిజాయితీ, నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత కలిగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పవన్ రావాలి పాలన మారాలి అంటూ నాగార్జున సాగర్ నుంచి ఇడుపులపాయ వరకు చైతన్య యాత్ర చేస్తున్న జనసైనికుడు బాలాజీ ఆదివారం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో బాలాజీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కల్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం కలిగిస్తున్న యాత్రికుడు బాలాజీకి అభినందనలు తెలిపారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు ఇక కాలం చెల్లిందని, ఐదు నెలల్లో వైసీపీ దాష్టీకాల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించనుందన్నారు. టీడీపీ, జనసేన పొత్తుకు క్షేత్రస్థాయిలో ప్రజామోదం లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఆళ్ళ హరి అన్నారు. యాత్రికుడు బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వైసీపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైసీపీ కక్ష సాధింపుకు సామాన్యుడి దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు బాధితులే అని అన్నారు. పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొత్తకోటి ప్రసాద్, టీడీపీ నాయకుడు షేక్ బాషా, వడ్డీల సుబ్బారావు, శెట్టి శ్రీను, కొలసాని బాలకృష్ణ, తాడికొండ శ్రీను, సైదులు తదితరులు పాల్గొన్నారు.