విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన ఉండి జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల సమస్య మీద పోరాటంలో భాగంగా ఉండి నియోజకవర్గం ఉండి మండలంలో ఉండి నుండి గణపవరం వెళ్ళే మార్గంలొ రోడ్లు చాలా అధ్వానంగా ఉండడంతో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా జనసైనికుల ఆధ్వర్యంలో రోడ్లకు మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి, జనసేన ప్రోగ్రాంస్ కమిటి కార్యదర్శి తోట వాసు, ఉండి నియోజకవర్గంలో ఉండి, ఆకివీడు, కాళ్ళ మరియు పాలకోడేరు మండలాల జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.