జోగి, అంబటి మరియు రోజాకు సవాల్ ఇప్పటంపై చర్చకు వచ్చే దమ్ముందా? : గాదె

గుంటూరు, కూల్చివేతలతో మొదలైన జగన్ రెడ్డి ప్రభుత్వం దాష్టికాలు పరాకాష్టకు చేరాయని ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేతలపై మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని. దమ్ముంటే కూల్చివేతల పై చర్చకు రావాలని మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజాకు సవాల్ విసిరారు. పోలీసులను అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవాలని చూస్తే ఏం జరిగిందో నిన్న ప్రజల చూశారని అన్నారు. జోగి రమేష్ సన్నాసి అని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకుంటే జనసైనికులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చివరకు స్వాతంత్ర్య సమరయోధులు విగ్రహాలను తొలగించి వైఎస్ విగ్రహం చుట్టు కంచె వేసి పోలీసుల పహారా పెట్టారని అన్నారు. నిసిగ్గుగా మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 120 అడుగుల రోడ్డు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే లేదని. పోనీ రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా 120 అడుగుల రోడ్డు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. పోలవరం గురించి మాట్లాడడం చేతగాని అరగంట మంత్రి ఇప్పటం గురించి కేకలు పెడుతున్నాడాని పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇస్తే నేరం చేసినట్లు మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటం గ్రామం ఎక్కడ ఉందో తెలుసా అంబటి అంటూ ప్రశ్నించారు. విషయ పరిజ్ఞానం లేకుండా పాచికల్లు మొహం వేసుకొని అరవడం కాదని అరగంట రాంబాబుకి హితవుపలికారు. సొంత నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారించలేని రోజా ఇప్పటం విషయంలో తగుదునమ్మ అంటూ ఎగేసుకొని వచ్చిందని. ఇప్పటఒ గ్రామానికి దారేటో తెలుసా రోజా అంటూ ఎద్దేవా చేశారు. నోరుందికదా అని వాగితే వీర మహిళలు పళ్ళు రాలగోడతారని హెచ్చరించారు. నీ జాతకం మొత్తం తెలుసని జబర్దస్త్ కి ఎక్కువ ఎమ్మెల్యే పదవికి తక్కువని విమర్శించారు. అక్రమాలు అవినీతి నగరి మొత్తం కోడె కూస్తున్న అది మరచి పవన్ కళ్యాణ్ ని విమర్శించడాన్ని స్థాయి ఏంటో తెలుస్తుందని అన్నారు. వైసిపిలో ఉన్న మంత్రులు 151 మంది ఎమ్మెల్యేలు సలహాదారులు అందరికి ఇదే నా సవాల్ దమ్ముంటే ఇప్పటం రండి అక్రమమో సక్రమమో తేల్చుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఆళ్ళ హరి, మధు లాల్, గంగారాజు, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.