చిన్నయవలసలో జనసేన జెండా ఆవిష్కరణ

పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలంలో చిన్నయవలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చిన్నయవలస గ్రామ యువత ఆధ్వర్యంలో మొదట జనసేన ఆధ్వర్యంలో గ్రామ పర్యటన నిర్వహించి, అనంతరం ప్రజలందరి సమక్షంలో జనసేన జెండా ఆవిష్కరణ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా జరిగింది. చిన్నయవలస నాయకులు పద్మారావు, కృష్ణ, వెంకటరమణ మరియు జనసైనికులందరి ద్వారా ఆ గ్రామంలోని సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం దిశగా క్రృషి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. ఆ గ్రామంలోని ఆదివారం పర్యటనలో 80% మంది ప్రజలు చైతన్యవంతులై, జనసేన పార్టీకి మద్దతు పలకడం మార్పుకు బలమైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అల్లు రమేష్, గోవిందమ్మ, విశ్వేశ్వరరావు, సూర్యనారాయణ, శ్రీను, చిట్లి గణేష్, గౌరి శంకర్, శివ, కిషోర్, సాయి, సత్యనారాయణ, సంచాన గంగాధర్, రవి, అనంత్, శ్రీకర్, చిన్నారావ్, సతీష్, గణేష్, శ్యామ్, శంకర్, మణికంఠ, గార గౌరీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.