గొళ్లపాడు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, గొళ్లపాడు గ్రామంలో మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో గొల్లపాడు గ్రామ అధ్యక్షుడు పోగుల రాము నేతృత్వంలో గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసిన నూతన జనసేన జెండా ఆవిష్కరణ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా జనసేన నూతన జెండా ఆవిష్కరించడం జరిగినది. కార్యక్రమంలో ముందుగా ముప్పాళ్ళ మండలం నుండి భారీ బైక్ ర్యాలీతో జనసైనికులు మరియు మండల అధ్యక్షుడు నియోజకవర్గం వెంకట అప్పారావు కు స్వాగతం పలికి మొదట గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఇంటింటికి పవన్ అన్న ప్రజాబట్ట కార్యక్రమం నిర్వహించి, ఎస్సీ ఎస్టీ కాలనీలో సందర్శించి వారి యొక్క కష్టనష్టాలు తెలుసుకుంటూ వారికి ఇబ్బందులని తెలుసుకొని ఒక ప్రభుత్వంలో వారికి రావలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా దారి మళ్ళిస్తున్నారో వాళ్లకు జరిగిన అన్యాయం గురించి వాళ్లకు వివరిస్తూ మీరందరూ మీ బిడ్డగా ఒకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి 2024లో ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని మీ యొక్క ఓటు గాజు గ్లాస్ గుర్తుకు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేవలం పొద్దున లేచిన నుంచి పడుకునేంతవరకు ఒకటే పనిగా చిరంజీవి గారి గురించి మెగా ఫ్యామిలీ గురించి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ భార్యల గురించి ఇలాంటి విషయాలు మీద పెట్టినంత శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పెట్టకపోవటం మన దౌర్భాగ్యమని ఇలాంటి నాయకులని మన ఓట్లు వేసి ఎన్నుకున్నందుకు మనందరం చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నామని, దేవాలయం లాంటి అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన మంత్రులు తల్లిదండ్రులు చిన్న పిల్లలు చూసి సిగ్గుపడే అంతగా భాషా మాట్లాడుతున్నారని ప్రజలకు తెలియజేశారు. ఈ రాష్ట్రం నుంచి ఈ సైకో ముఖ్యమంత్రిని తన ప్రభుత్వాన్ని రేపు జరగబోయే 2024 ఎలక్షన్ లో బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడున్న స్థానిక మంత్రి అంబటి గారు తన ఆస్తులు కూడా పెట్టుకున్నారు. తప్ప ప్రజలకు ఎలాంటి పనులు చేసిన దాఖలాలు లేవు నియోజకవర్గానికి కనీస అభివృద్ధి కూడా చేయని పరిస్థితి ఆయన ఇచ్చిన శాఖ ఎంటో కూడా తెలియక కేవలం ప్రెస్ మీట్ లు పెట్టి మెగా ఫ్యామిలీని మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం తప్ప ఈ సత్తెనపల్లి నియోజకవర్గ సమస్యల మీద కనీసం దృష్టి ఇప్పటి కన్నా పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.