గోవిందపురంలో జనసేన జెండా ఆవిష్కరణ

చిలకలూరిపేట నియోజకవర్గం: గోవిందపురం గ్రామంలో నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి ఆధ్వర్యంలో ఆదివారం 8వ జనసేన జెండా ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. అలానే 8వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అదే గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 180 మందికి పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు అందించారు. 38 మందికి ఉచితంగా చుక్కడాలు తీయిస్తున్నామని, 80 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కన్నా రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజిని మాట్లాడుతూ ధర్మో రక్షిత రక్షితహా అన్న అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకు కచ్చితంగా రాబోవు ఎలక్షన్స్ ఒక నిదర్శనంగా నిలుస్తాయని, అధికార పక్షం వారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ లోకి అడుగు పెట్టనివ్వము అని శెబధాలు చేస్తున్నారు. వారి శెబధాలుకు సమాధి కట్టే రోజు దగ్గరలోనే వుంది అని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజీ మాట్లాడుతూ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులు ప్రకటించిన తరువాత నియోజకవర్గంలో మొదటి కార్యక్రమం చేయడం అందులో టీడీపీ వారు పాల్గొనడం రేపటి గెలుపుపై ప్రజలలో నమ్మకం మరియు విశ్వసనీయత కలిగాయని బాలాజి కొనియాడారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాష్ట్రములో చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళు చేస్తున్న అవినీతిని ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, చంపటం జగన్ చేసిన అభివృద్ధి అని అన్నారు ఈ నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ కూడ తేలేక పోయారు, ఉన్న ఒక్క జాకీ చెడ్డీ కంపెనీ కూడా పారిపోయింది అని విమర్శలు చేసారు. మన నియోజకవర్గం గోవిందపురం గ్రామంలో మంచి నీటి బావిని బాగుచేయించమని ప్రజలు 4 సంవత్సరాలనుండి మంత్రి గారిని వేడుకున్నారు. మంత్రిగారు గ్రామానికి మంచి నీరు అందించకలేకపోయారు కానీ జనసేన జెండా ఆవిష్కరణ అడ్డుకోవటానికి మాత్రం అధికారం ఉపయోగిస్తున్నారు. 10 రోజుల్లో మంత్రి విడదల రజని మంచి నీరు అందిచకపోతే పెంటేల బాలాజి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ బిక్షాటన చేసి ఆ ఊరి సమస్య తీరుస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమం గ్రామ నాయకులు తోటకూర అనిల్ కుమార్ మరియు గ్రామ నాయకుల సహకారంతొ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణలో గోవిందపురం గ్రామ నాయకులు, తోటకూర అనిల్. శివ నాగేశ్వరావు కుప్పల కోటి, గోపవరపు మహేష్, లక్ష్మయ్య, ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, బాచినేని రామకోటయ్య, ఆత్మకూరు శ్రీనివాసరవు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి అచ్చుకోల ఎల్.బి నాయుడు, అరుణ్ కుమార్, చిలకలూరిపేట మండల నాయకులు తిమ్మిశెట్టి కె కోటేశ్వరరావు, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, జి.డి నాయుడు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మేకల రామారావు, మల్లా కోటి, కార్యదర్శులు, పాపన హనుమంతరావు, బొందలపాటి సుబ్బారావు, అమరేశ్వరి, మానస, పట్టణ నాయకులు అచ్చుకోల అరుణ్, పగడాల, సన్నీ నెలటూరి, గోవిందు గణేష్, తోటకూర అనిల్ కుమార్, పెద్దింటి చంద్రశేఖర్. పెద్దింటి అనిల్, సాయి పాల్గొన్నారు.