రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా మదర్ థెరిసా జయంతి

రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి ఘనంగా నిర్వహించారు. మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ మదర్ థెరిసా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు అభినందనీయమని గుర్తు చేస్తూ నేటి సమాజానికి యువతకి మదర్ థెరిసా చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, హరిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.