గుడ్లూరులో జనసేన ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ

75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని గుడ్లూరులోని బిసి కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పులి మల్లికార్జున, గుడ్లూరు మండల జనసైనికులు వీర మహిళల నడుమ జాతీయ పతాకంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పులి మల్లికార్జున మాట్లాడుతూ జాతీయ నాయకులు ఎందరో మహనీయులు పోరాట, త్యాగ స్పూర్తి ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగింది. అలాంటి మహనీయుల మేలి గుణాలను పునికిపుచ్చుకుని, వారి ఆదర్శాలను స్పూర్తి గా తీసుకుని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారు ప్రజా సమస్యల పట్ల, వైకాపా, టిడిపి ల కంటే భిన్నంగా నూతన భావజాలంతో స్పందిస్తున్నారు అని చెప్పారు. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించని విధంగా జాతీయ భావాలు కలిగి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు 30 కోట్ల తో ఆర్థిక భరోసా ను ఇవ్వడం, రేపు అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ ‌పంపిణీ, రేషన్ కు బదులుగా 2 వేల నుంచి 3 వేల రూపాయల ఆర్థిక భరోసా, పేదలకు ఉచితంగా ఇసుక ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించి సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సమానంగా నిర్వహించగల సామర్థ్యం పవన్ కల్యాణ్ గారికి ఉంది అని కొనియాడారు. ప్రస్తుతం కుళ్ళు, కుతంత్రాలు, అవినీతి,మాట తప్పం- మడమ తిప్పం అంటూ అబద్ధాలు, ఫ్యాక్షన్, దుర్భాష లతో కూడిన రాజకీయాలు కొనసాగుతున్న ఈ రోజుల్లో జాతీయ భావాలు కలిగి ఉద్యమ స్పూర్తి తో ఉన్న పవన్ కల్యాణ్ గారి వంటి నాయకులు ప్రస్తుతం భావితరాలకు ఎంతో అవసరం. చివరగా భారత దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ ‌బ్రిటీష్ వారి కబంద హస్తాల నుంచి స్వేచ్చా వాయువులు తీసుకుని 75 వసంతాలు పూర్తి చేసుకున్న నా భారతావని విశ్వ విఫణిలో అఖండ స్థాయి కి చేరుకోవాలని ఆశిస్తూ.. నా భారతదేశానికి వందనం అంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కదిరి భవానీ, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సిద్దయ్య, గుడ్లూరు మండల జనసైనికులు అన్నంగి చలపతి, మూలగిరి శ్రీనివాస్, హజరత్తయ్య, అమోస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *