చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లి మండలం గాంధీనగరంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జరిగిన కొవ్వొత్తుల రాలీలో పాల్గొన్న నియోజకవర్గ, మాజీ జడ్పీ చైర్మాన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన ఇంఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు మరియు తదితర జనసేన నాయకులు నాయుడు దుర్గాప్రసాద్, వెంకటరత్నం, కాశీ, ఆరేటి రత్నం, గాజుల రవి, శివ, వీరమహిళలు, టీడీపీ శ్రేణులు.. ఇందులో భాగంగా సువర్ణరాజు మాట్లాడుతూ చంద్రబాబు గారికి మేము తోడుంటాం అంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకేనా ఆయన్ని అరెస్ట్ చేసింది అని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఇలా అంధకారంలోకి వెళ్లడానికి కారణం ప్రస్తుత అధికార పార్టీ అని పలు వ్యాఖ్యలు వ్యక్తం చేశారు.