గ్రేటర్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో

భారతీయ జనతాపార్టీ గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా స్వీకరించి ప్రచారంలో దూసుకుపోతుంది. అగ్రనేతలందరినీ భాగ్యనగరానికి రప్పిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నగరంతో విస్తృతస్ధాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి డివిజన్ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్‌ నుంచి ఆల్విన్‌ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.