ముందుగా వస్తున్న’అల్లుడు అదుర్స్’

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ, ఒకరోజు ముందుగా అంటే 14నే విడుదల చేయాలని నిర్మాతలు తాజాగా నిర్ణయించారు.

సినిమా రిలీజ్ డేట్ మార్పుల విషయంపై మాట్లాడిన బెల్లంకొండ సురేష్ .. ”జనవరి 15న అని నేను ప్రకటించగానే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ తిట్టారు. జనవరి 14న పండగ పెట్టుకొని 15న ఎలా రిలీజ్ చేస్తారు అని అనడంతో 14కే ఫిక్స్ అయ్యాం అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు.