UPSC: ఎన్డీఏ, నేవీ ఫైనల్ రిజల్ట్స్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఎన్డీఏ, నేవీ ఫైనల్ ఫలితాలలో మొత్తం 662 మంది అర్హత సాధించారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు యూపీఎస్సీ తెలిపింది.

2019 నవంబర్ 17న ఎన్డీఏ, నేవీ పరీక్షలకు యూపీఎస్సీ నిర్వహించడం తెలిసిందే. సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, డిఫెన్స్ అడ్మిషన్ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించిన ఈ పరీక్షల తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు.