24 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన UPSC

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 24 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు

మొత్తం ఖాళీలు: 24

సైంటిఫిక్ ఆఫీస‌ర్‌: 1

జూనియ‌ర్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌: 14

లెక్చ‌ర‌ర్‌: 7

స‌బ్ ఎడిట‌ర్: 2

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ(బోట‌నీ/ ఫార్మ‌సీ, ఫిజిక్స్‌, అప్ల‌యిడ్ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, పాలీమ‌ర్ కెమిస్ట్రీ, ఎల‌క్ట్రానిక్స్‌, ఫిజియోథెర‌పి, ప్రొస్తెటిక్స్‌/ ఆర్థోటిక్స్ అప్లియ‌న్సెస్‌, సైకాల‌జీ)/ గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ( టెలీక‌మ్యూనికేష‌న్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ), డిగ్రీ(లా) ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, OBC, EWS అభ్యర్థులకు రూ. 25, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఉమెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: ఆగస్టు 27, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/