UPSC IES 2020 నోటిఫికేషన్‌ విడుదల పూర్తి వివరాలు

UPSC, IES ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆగస్టు 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ (ఐఈఎస్‌)-2020 ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్‌లో నిర్వ‌హిస్తామ‌ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) గతంలోనే ప్ర‌క‌టించింది. జూన్ 10న ఐఈఎస్, ఐఎస్ఎస్ (ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే ఐఈఎస్‌కు సంబంధించి పోస్టులు ఖాళీగా లేవ‌ని, ఈ ఏడాది ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని అప్పుడు ప్ర‌క‌టించింది.

అయితే ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కోరిక మేర‌కు జూన్ 10న విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ను యూపీఎస్సీ ఉప‌సంహ‌రించుకుని.. ఐఈఎస్‌కు సంబంధించిన తాజాగా ఆగ‌స్టు 11న నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని, ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ఐఈఎస్‌ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఐఈఎస్, ఐఎస్ఎస్ ప‌రీక్ష‌ల‌ను ఎప్ప‌టిలాగే ఒకేసారి నిర్వ‌హించ‌నుంది.

ముఖ్య సమాచారం:

పరీక్ష పేరు: ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్‌(ఐఈఎస్‌) – 2020

అర్హ‌త‌: ఎక‌న‌మిక్స్‌/ అప్లయిడ్‌ ఎక‌న‌మిక్స్‌/ బిజినెస్ ఎక‌న‌మిక్స్‌/ ఎక‌నామెట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త.

వ‌య‌సు: ఆగస్టు 1, 2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, వైవా వాయిస్ ఆధారంగా.

ప‌రీక్ష తేది: అక్టోబ‌రు16, 2020 నుంచి అక్టోబర్‌ 18 వరకు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజుల లేదు)

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 01, 2020

వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/