ఊరు వాడా జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం

  • హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ చేసిన బత్తుల
  • ఉత్సాహంగా, భారీగా పాల్గొన్న జనసేన- టిడిపి శ్రేణులు
  • జననీరాజనాలతో ఉదృతంగా కొనసాగుతున్న పాదయాత్ర
  • మహాపాదయాత్రలో భారీగా పాల్గొన్న జనసేన టీడీపీ కార్యకర్తలు
  • హరతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

రాజానగరం నియోజకవర్గం: (లాలాచెరువు) హౌసింగ్ బోర్డు కాలనీలో “జనం కోసం జనసేన” “మహాపాదయాత్ర”లో సోమవారం రాజానగరం జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తె వందనాంబిక పాల్గొన్నారు.
పాదయాత్రలో మొదటగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అక్కడి నుండి పాదయాత్రగా టీడీపీ మరియు జనసేన శ్రేణులతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్తూ జనసేన పార్టీ సిద్ధంతాలు, ఆశయాలు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. దారి పొడవున ఏర్పాటు చేసిన అనేకచోట్ల జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.