జగన్‌ని ఉత్తరాంధ్ర పట్టభద్రులు విశ్వసించలేదు: గురాన అయ్యలు

విజయనగరం: వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా పట్టభద్రులు తీర్పు ఇచ్చారని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్‌ని ఉత్తరాంధ్ర పట్టభద్రులు విశ్వసించలేదన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. రాజకీయ బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గకుండా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను పట్టభద్రులు ఓటు ద్వారా తిప్పుకొట్టారన్నారు. వేపాడ చిరంజీవిరావు గెలుపు కోసం కాపులందరూ ఐక్యంగా పనిచేశారన్నారు. ఇదే స్పూర్తితో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలంటే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడమే ప్రధాన ధ్యేయంగా కాపులంతా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా విజయం సాధించిన వేపాడ చిరంజీవి రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు.