అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు

*పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్

పిడుగురాళ్ల ఈ విద్యుత్ సంక్షోభానికి వైసిపి అనాలోచిత విధానాలే కారణమని, గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యూనిట్ 4:80 చొప్పున నా 25 ఏళ్ల పాటు చేసుకున్న ఒప్పందాలను ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా రద్దు చేసిందని, ఇప్పుడేమో కోల్ ఎనర్జీని 20 పెట్టి కొంటుందని, ప్రభుత్వం ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే.. విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని తెలియజేశారు. దీనివల్ల చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడి, ఉద్యోగస్తులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొని ఉన్నాయని తెలియజేశారు, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పసి పిల్లలు మరియు ముసలి వాళ్లు ఈ వేసవి కాలంలో తీవ్ర ఎండలతో ప్రాణాపాయ స్థితిలో పడే అవకాశం ఉందని తెలియజేశారు. ఇది ఇలా ఉంటే జగనన్న బాదురు కార్యక్రమం ద్వారా కరెంటు బిల్లు పెంచడం మరింత దుర్మార్గమని ఇలాంటి చర్యలతో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటే జనసేన పార్టీ ఊరు కాదని.. రానున్న రోజుల్లో దీనిమీద రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.