ఘనంగా వైష్ణవ్‌ తేజ్‌ పుట్టిన రోజు వేడుకలు

  • కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్న చిరంజీవి అభిమానులు

రాజంపేట పట్టణంలో ఘనంగా వైష్ణవ్‌ తేజ్‌ పుట్టిన రోజు వేడుకను రాజంపేట చిరంజీవి యువత అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగార్జున, రాజంపేట చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చిట్టే గోపిక్రిష్ణల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్‌, కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్‌ కుమార్‌ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అతికారి దినేష్‌ కేక్‌ కట్‌చేసి అభిమానులకు పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైష్ణవ్‌ తేజ్‌ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయన అన్నారు. అనంతరం అభిమానులతో ఆయన కాసేపు ముచ్చడిరచారు. ఈ కార్యక్రమంలో రాజంపేట చిరంజీవి అభిమానులు, కార్యకర్తలు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభఙమానులు పాల్గొన్నారు.