ఘనంగా వైష్ణవ్‌ తేజ్‌ పుట్టిన రోజు వేడుకలు

కడప: ఘనంగా వైష్ణవ్‌ తేజ్‌ పుట్టిన రోజు వేడుకను కడపలో కడప మెగా కుటుంబ అభిమాని అబ్బన్న రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్‌ కుమార్‌ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా పరిషత్ పక్కన ఉన్న పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరుపేద అభాగ్యులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు రంజిత్, రాజగోపాల్ చేతుల మీదుగా పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైష్ణవ్‌ తేజ్‌ మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అడుగుజాడల్లో నడుస్తూ మరిన్ని మంచి చిత్రాలలో నటిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి, మెగా అభిమానులు బాలు నాయక్, సుధీర్ నాయక్, వినోద్, రాజశేఖర్, మరియు అభిమానులు పాల్గొన్నారు.