అల్లూరి సీతారామారాజు కి నివాళులర్పించిన వంపురు గంగులయ్య

పాడేరు, నియోజకవర్గ ప్రధానకేంద్రంలో గల నక్కలాపుట్టులో మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్బంగా జనసేన పార్టీ తరుపున పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపురు గంగులయ్య మరియు ముఖ్యనాయకులు జనసైనికులు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంపురు గంగులయ్య మాట్లాడుతూ… ఈ మన్యం ప్రజల హృదయాల్లో ఎప్పటికి ఆ మహనీయడికి ఒక చిరస్మరణీయ స్థానం ఉంటుంది. బ్రిటిష్ దొరల కబందహస్తాల నుంచి స్వేచ్ఛ ప్రసాదించేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆ మహనీయడికి ఈ గిరిజన జాతి యావత్తు రుణపడి ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీ అల్లూరిసీతారామరాజు నే స్ఫూర్తిగా తీసుకుంటుంది.యువకులు జనసైనికులు వీర మహిళలు ఒక విషయం గుర్తుంచుకోవాలి మన ప్రాంతం మన ప్రజలు ఈ నేల ఉద్యమాలకు, పోరాటాలకు, త్యాగాలకు, మారుపేరని అల్లూరి సీతారామరాజు మనకు స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి నివాళుల సంస్మరణ సమావేశంలో పాడేరు పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల హసన్ మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ, ప్రధానకార్యదర్శి పాంగి చిన్నబ్బాయి, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్,జనసైనికులు వంపురు కోటి, సత్యనారాయణ, రాజు ప్రసాద్, పవన్ తేజ్, భూపాల్, అశోక్ కిలో, సంతోష్, గెమ్మెలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.