37వ వార్డులో జనసేన కార్యాలయం ప్రారంభించిన వంశీకృష్ణ యాదవ్

విశాఖ, 37వ వార్డ్ అధ్యక్షులు గరికిన రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ పాల్గొని, నూతన వార్డ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మొదటగా జ్యోతిరావు పూలే, దాదా సాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు విశాఖలో జనసేన పార్టీ మరింత బలోపేతానికి ప్రతి వార్డ్ లో జనసేన సిద్దాంతాలు ప్రజలకు తెలియజేసే విధంగా రూపకల్పన చేస్తామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగిపోయే రోజులు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, జి.వి.ఎం.సి ప్లోర్ లీడర్ వసంత లక్ష్మీ, 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు, వారాహి యాత్ర కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ పట్నాయక్, వివిధ వార్డ్ అధ్యక్షులు, నాయకులు, శ్రావణ్, నీలం రాజు, ఆంథోనీ, యజ్ఞశ్రీ, రుపాదేవి, శ్యామ్, హరి, సూరిబాబు, యాల్లాజి, భాస్కర్, నరేష్, పవన్, సతీష్, జనసేన వీర మహిళలు, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.