రాజంపేటలో ఘనంగా మిని వారాహి ప్రారంభం

రాజంపేట: జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ రాజంపేటలో వారాహి ప్రారంభంను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అతికారి దినేష్ మన్నురు యల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేయించి రాజంపేట జనసేన పార్టీ ఆఫీసు నుంచి పట్టు బట్టలు, పూలు, పండ్లను జనసేన వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికుల సమూహంతో వెళ్ళి అమ్మవారికి అందజేశారు. అమ్మ వారికి పూజలు నిర్వహించిన తరువాత మినివారహికి పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం తరువాత మిని వారాహిపై ఎక్కి భారీ జనసేన శ్రేణుల మధ్య అతికారి దినేష్ ఊరేగింపుగా యల్లమ్మ దేవలయం నుంచి రాజంపేట జనసేన పార్టీ ఆఫీసు బయలుదేరారు. మార్గమధ్యంలో జనసేన పార్టీ మండలాల నాయకులు భారీ గజమాలను ఏర్పాటు చేసి క్రేన్ ద్వారా అతికారి దినేష్ ను సత్కరించారు. అనంతరం జనసేన పార్టీ ఆఫీసు వద్ద సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీనియర్ నాయకులు అతికారి వెంకటయ్య మాట్లాడుతూ.. రాజంపేట జనసేన అడ్డా ఇక్కడ జనసేనను తెచ్చుకొని గెలిపించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గిప్ట్ ఇస్తాం అని చెప్పగానే సభా ప్రాంగణం అంత ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది‌. జనసేన పార్టీ రాజంపేట సమన్వయకర్త అతికారి దినేష్ మాట్లాడుతూ రాజంపేటలో ప్రతి ఒక్క మండలాన్ని మినీ వారాహి ద్వారా సందర్శిస్తానని, అక్కడి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా రాబోవు రోజులు అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు. యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ జెండాని రాజంపేటలో ప్రతి గ్రామానికి తీసుకొని వెళ్లి ప్రజల పక్షాన పోరాడిన ప్రతి నాయకుడికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతూ రాయలసీమ ఆడబిడ్డలు చైతన్యంతో ముందుకు వచ్చి భావితరాల భవిష్యత్తును కాపాడుకునే దిశగా అడుగులు వేయాలని కోరారు. మహిళలని కించపరిచే విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న ఈ అధికార వైసీపీ పార్టీ అహంకారాన్ని తుంచే విధంగా గట్టి తీర్పుని ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా రాజంపేటలో జనసేన పార్టీ చాలా బలపడి ఉంది. జగన్మోహన్ రెడ్డికి గట్టి తిరుగుబాటు రాజంపేట నుంచి మొదలవుతుందని వ్యాఖ్యానించారు. రాజంపేట గడ్డపై జనసేన జెండా రెపరెపలాడుతోందని కీర్తన అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భారీగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు సీనియర్ రాజకీయ నాయకులు అతికారి వెంకటయ్య, జనసేన రాష్ట కార్యదర్శులు ముఖరం చాన్, తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ పోగ్రాం జోన్-1 కన్వీనర్‌ జోగినేని మణి సిద్దవటం సర్పంచ్ ఓబులయ్య రాజంపేట నియోజకవర్గ నాయకులు కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ నాగర్జన, పోలిశెట్టి శ్రీనువాసులు, జిగిలి ఓబులేసు, ఉపేంద్ర, వీరమహిళలలు వరలక్ష్మి, కొట్టే మణేమ్మ జనసేన నాయకులు దాదాపు 800 మంది జనసేన వీరమహిళలలు, జనసైనికులు విచ్చేశారు.