జనసేన వైపు మొగ్గు చూపుతున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు

  • లింగసానిపల్లి యువతతో వంగ లక్ష్మణ్ భేటీ
  • త్వరలో లింగాసానిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ
  • బహుజనుల పాలన తీసుకురావడానికి కృషి చేద్దాం

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, లింగసానిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు, సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ను కలవడం జరిగింది.. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బహుజన పాలన లేక ఒక వర్గ పాలనలో నాగర్ కర్నూల్ నలిగిపోతుంది, మన బహుజన పాలన మళ్ళీ సాధించాలని అనే ఆలోచనతో మీతో పాటు మీ అడుగులో అడుగేస్తు, జనసేన పార్టీ బలోపేతానికై కృషి చేస్తామని లింగసానిపల్లి గ్రామంలోని యువత తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామస్థులతో వంగ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు జనసేన గళం వినిపిస్తూ ముందుకు వెళ్తున్నాం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమంతో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బహుజనుల రాజ్యాధికార దిశగా ముందుకు వెళదాం, త్వరలో లింగసానిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించి, నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేద్దామని నాయకులతో దిశ నిర్దేశం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు ఆంజనేయులు, ఈశ్వర్, లక్ష్మణ్, సూర్య, వంశీ రెడ్డి, దేవేందర్, అరుణ్, అశోక్, నరేందర్, నరేష్, రాజు, విజయ్, కే. నరేష్, సంతోష్, శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.