వారాహి సైకిల్ వర్షన్ రిలీజ్

నెల్లూరు: జనసేన పార్టీ సింబల్ ను పవన్ కళ్యాణ్ ఫోటోను గతంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన మాదవ్, వారాహి సైకిల్ వర్షన్ ను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ శనివారం నెల్లూరు లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుష్ట శిక్షణకు అవతారమెత్తిన అమ్మ వారాహి పేరుతో రాష్ట్రంలో అరాచక శక్తులను రూపుమాపేందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంపై బయలుదేరారు.. అదే రంగులను ఉపయోగిస్తూ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసుని, పవన్ కళ్యాణ్ గారిని సైకిల్ పై ముద్రిస్తూ వారాహి సైకిల్ వర్షన్ సుధా మాధవ్ లాంచ్ చేయటం సంతోషంగా ఉంది. జనసేన పార్టీ పైన ఉన్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రయోగం అభినందనీయం. ఎంతో వ్యయంతో కూడుకున్న పని దాదాపుగా ఒకసారి ఈ మోడల్ తయారు చేయాలంటే 500 సైకిళ్ళు పైగా ఆర్డర్ చేయాల్సి ఉంది. జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో డబ్బు లెక్క చేయకుండా ఎటువంటి వత్తిడికి తలొగ్గకుండా జనసేన ముందుకు తీసుకెళుతున్న వారికి శుభాభినందనలు. జనసైనికులు జనసేన మద్దతు దారులు అందరూ కూడా ఒకసారి సుబేదార్ పేట నందు గల వారి వారి సైకిల్ షాప్ కి విచ్చేసి వారిని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.. నెల్లూరు సిటీ సుబేదార్ పేట నందు గల వారి సైకిల్ షాప్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి గురుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, అలేఖ్, కంధర్, హేమ చంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.