వారాహి యాత్ర సన్నాహక పిఠాపురం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు జనసేన కార్యాలయం నందు సోమవారం జరిగిన వారాహి యాత్ర సన్నాహక పిఠాపురం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశ ముఖ్య అతిథిలు జనసేన పార్టీ వారాహి యాత్ర ప్రత్యేకపరిశీలకులు, జనసేన ఇన్చార్జి నరసాపూర్ బోమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. జూన్ 14 15 16 తేదీలలో జనసేనాని వారాహి యాత్ర ద్వారా పిఠాపురం నియోజకవర్గము నందు ముందుగా 14వ తేది సాయంత్రం7-00 గంటలకు సత్తెమ్మతల్లి గుడి [దుర్గాడ జంక్షన్]నుంచి వారాహి యాత్ర పిఠాపురం నియోజకవర్గ నందు ప్రారంభమవుతుందని, అదే రోజు రాత్రికి గొల్లప్రోలు నగర పంచాయతీ నందు శ్రీకృష్ణ విల్లా ఫంక్షన్ హాల్ నందు 14వ తేదీన పవన్ కళ్యాణ్ గారు బస చేస్తారు. 15వ తేదీన శ్రీకృష్ణ విల్లా నుండి పలు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. అనంతరం 16 సాయంత్రం వరకు పలు కార్యక్రమాలను శ్రీకృష్ణ విల్లా నుంచే చేయబడతాయి. 16 సాయంత్రం 6 గంటల సమయంలో పిఠాపురం మున్సిపల్ పార్కు{ఉప్పాడ బస్సుస్టాండ్} వద్ద బహిరంగ సమావేశం నిర్వహించబడుతుందని, అనంతరం చిత్రాడ గ్రామం నందు మన పిఠాపురం నియోజకవర్గం నందు వారాహియాత్ర ముగిసి, కాకినాడ-2 నందు ప్రారంభించబడుతుందని బోమ్మిడి నాయకర్ తెలియజేశారు. మరో పరిశీలకులు రామచంద్రాపురం జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసైనికులు తీవ్రమైన కృషి చేసి వారాహియత్రను విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉందని ఆయన తెలియజేశారు. అనంతరం మరో పరిశీలకులు పెద్దాపురం నియోజవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు మాట్లాడుతూ.. వారాహియాత్ర వల్ల పిఠాపురం నియోజవర్గంలో భారీ స్థాయిలో ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీకి వలసలు పెరిగుతాయని, అదే విధంగా 2024వ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పిఠాపురం నియోజవర్గం నుంచి విజయం సాధించడం ఖాయమని ఉద్బోధించారు. జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి జనసైనికులు వారాహియాత్రను విజయవంతం చేయుటకు తగిన కృషి చేయాలని ఆకాంక్షించారు. చేబ్రోలు గ్రామంలో నుండి రూట్ మ్యాప్ మార్పులు తీసుకొని‌ రావాలని జనసేన నాయకులు, జనసైనికులు, పరిశీలీకులను సభ ముఖంగా కొరియున్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ మాకినీడి వరప్రసాద్, గొల్లప్రోలు మండల జనసేన అధ్యక్షులు అమరాది వల్లీ రామకృష్ణ, గొల్లప్రోలు నగర అధ్యక్షురాలు శ్రీమతి వినుకొండ శీరిషా, పిఠాపురం మున్సిపల్ జనసేన అధ్యక్షులు బుర్రా సూర్యప్రకాశ్, గొల్లప్రోలు మండల జనసేన వీరమహిళా అధ్యక్షురాలు వినుకొండ అమ్మాజీ, పిఠాపురం మున్సిపల్ వీరమహిళా అధ్యక్షులు కొలా దుర్గ, పిఠాపురం మండల జనసేన నాయకులు బస్సా సురేష్, అల్లం దొరబాబు, బుద్దాల చంటి, దిబ్బీడి సురేష్, పెద్దింటి శివ, గంటా గోపి, మంతిన గణేష్, మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, జ్యోతుల సీతరాంబాబు, చేశెట్టి భద్రం, జ్యోతుల వాసు, విప్పర్తి శ్రీను, జ్యోతుల వీరబాబు, నిమ్మల కన్నా, జ్యోతుల గోపి, మచ్చర్ల‌శ్రీను, జ్యోతుల సాంబ తదితరులు పాల్గొన్నారు.