వారాహి యాత్ర విజయవంతం కావాలి జీలుగుమిల్లిలో సర్వమత ప్రార్ధనలు

పోలవరం నియోజకవర్గం: జీలుగుమిల్లి మండలంలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పవన్ కళ్యాణ్ గారి వారహి యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, ప్రజాశ్రేయస్సు కోసం ఆయన ముఖ్యమంత్రి గాను నియోజకవర్గంలో చిర్రి బాలరాజు ఎమ్మెల్యే గాను గెలవాలని, రాక్షస పాలన అంతరించిపోవాలని, రాష్ట్రము సుభిక్షముగా ఉండాలని సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అభయాంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో చర్చ్ లో, మసీద్ లో ప్రార్థనలు చేసారు. ఎ కార్యక్రమంలో డేవిడ్, కోలా మధు, రాంబాబు, బండారు అనిల్, కోలా ధర్మరాజు, సురేష్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు.