వారాహి యాత్ర విజయవంతం కావాలి: ఎం. హనుమాన్

  • వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం. హనుమాన్

విజయవాడ వెస్ట్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన 3వ విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆగస్టు 11వ తేదీ శుక్రవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోతుల మహేష్ ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం నిర్వహించి, అనంతరం హుస్సేనిషా ఖాధరి దర్గా యందు చాదర్ సమర్పించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమ పోస్టర్ ను బుధవారం జనసేన నాయకులు మరియు న్యాయవాది ఎం. హనుమాన్ ఆవిష్కరించారు.