వరరామచంద్రపురం మండల అల్లు అర్జున్ ఆర్మీ అన్నదాన కార్యక్రమం

రంపచోడవరం, ఏప్రిల్ 8 వ తారీఖున మెగా మేనల్లుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 100 రోజుల వేడుక పురస్కరించుకొని 87వ రోజున వర రామచంద్రపురం మండలం అల్లు అర్జున్ ఆర్మీ తరఫున మండలంలోని మారుమూల గ్రామమైన దారపల్లిలో గ్రామస్తులకి భోజనాలు పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ ఆర్మీ అధ్యక్షులు ముత్యాల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ హాజరవడం జరిగింది. మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.