హరి రామ జోగయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన వాసగిరి మణికంఠ

  • రాజకీయ కురవృద్ధుడు, మాజీ హోం మంత్రి హరి రామ జోగయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన వాసగిరి మణికంఠ

ఆచంట: మాజీ హోం శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు మరియు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చేగొండి హరి రామ జోగయ్యని పాలకొల్లులోని ఆయన స్వగృహం నందు గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ గౌరవంగా కలిశారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రాజకీయ కురువృద్ధుడైన పెద్దలు జోగయ్య గారితో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించి, ఆయనతో సలహాలు సూచనలు తీసుకొన్నామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని వారందరికీ న్యాయం చేయగల నిస్వార్థ నాయకుడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత రాజకీయాల్లో యువత ఆవశ్యకత చాలా ఉందని వారి ఆంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న యువత ఆయన బాటలో పయనించాలని రాబోయే రోజుల్లో జనసేన – టిడిపి పార్టీల విజయానికి నిస్వార్ధంగా కృషి చేయాలని జోగయ్య దిశాద్దేశం చేశారని వాసగిరి మణికంఠ పేర్కొన్నారు.