ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి నిత్యావసరాలు అందజేసిన వీరమహిళలు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని రాజీవ్ గృహకల్పలో చిన్నబాబు ఆక్సిడెంట్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి జనసైనికుల సహకారంతో వీరమహిళల చేతుల మీదగా మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, తన్నీరు ఉష మరియు వీరమహిళ నాగేంద్రం పాల్గొన్నారు.