ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైస్ ఎంపీపీ ఇంటి పల్లి ఆనందరాజు

డ్వాక్రా మహిళల దగ్గర అభయ హస్తం సంవత్సరానికి 385 రూపాయలు తీసుకున్న అభయ హస్తం రద్దు చేశారంటూ రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో సున్నా వడ్డి రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆనందరాజు మాట్లాడుతూ.. అభయ హస్తం పథకాన్ని మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయడానికి, మహిళలకు అండగా ఉండేందుకు అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని దుయ్యబట్టారు. మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయం హస్తం పథకాన్ని మరోసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే డ్వాక్రా మహిళలకు అభయ హస్తం పథకం ద్వారా.. మరణించిన మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని.. గతంలో అభయ హస్తం తీసుకున్న మహిళలు ఎవరైనా మరణిస్తే.. మరణించిన మహిళలకు 30000 రూ. లు ఇచ్చేవారని అది ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయాన్ని అమలాపురం ఎంపీ అనురాధ గారి తో చర్చించడం జరిగింది.