ప్రశ్నించే మా నాయకుడు మీద బురద జల్లుతారా..?

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల మండల పరిదిలోని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జి నాయకుడు వంపూరు గంగులయ్య పలుగ్రామల పర్యటనలో భాగంగా ప్రజలవద్దకు వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఓర్వలేక చింతపల్లి నాయకులు లేని పోనీ కూతలు కూస్తున్నారు మీ అసంబద్ధ విమర్శకు ప్రతివిమర్శగా జి.మాడుగుల జనసేన పార్టీ తరుపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు గంగులయ్య గారు గిరిజన ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతుంటే జనసేన నాయకులు పబ్లిసిటీ కోసమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు అంటారా?. జాతికి ద్రోహం చేసిన జాతి ద్రోహులు మీరు, మేము జాతి ద్రోహులం కాదని చెప్పండి. మీకే గనక గిరిజన ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే? మీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాల్గున్నర సంవత్సరాలు గడిచినా గిరిజన ప్రజలకు ఒరిగింది ఏమిలేదు. మీ(వైసీపీ)నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు నట్టేట ముంచలేదా?. మీ నాయకురాలు గిరిజన జాతికి ద్రోహం తలపెట్టి గిరిజన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టె ప్రయత్నం చేయలేదా..?. ముఖ్యంగా ఈ రాష్ట్ర యువతి, యువకులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి ఏడాది జాబ్ కాలెండరు విడుదల చేస్తామని యువతకు మోసం చెయ్యడం నిజం కాదా?. మీ ప్రభుత్వ పాలనలో పంచాయితీలా దుస్థితి ఏ విధంగా ఉందొ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి?. కనీసం సర్పంచ్ అనే పదానికి విలువ లేకుండా చేశారే దీనికి కారణం ఎవ్వరు?. మీ వైసీపీ ప్రభుత్వం కాదా?. మన నియోజకవర్గంలో కనీస సదుపాయాలు లేక చాలా గ్రామాలు కొట్టు మిట్టడుతున్నాయి. తాగడానికి నీరు, రోడ్ సదుపాయాలు లేక డోలి మొతలే దిక్కు ఈ సత్యాన్ని కాదనగలరా?. ఇది మీకు కనిపించదు ఇవన్నీ కప్పి పుచ్చుకోవడానికి మీ కుటిల ప్రయత్నాలు వీటిపై మీకు ప్రశ్నించే మా నాయకుడు మీద బురద జల్లుతారా?. ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఒక్క అవకాశం అన్నారు. ఒక్కసారి మాత్రమే ఈ గిరిజన ప్రజలు అమాయకులూ కాదు. అసెంబ్లీలో మార్చి 24/3/2023 న మీ వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రజలకు మోసం చేస్తూ బోయవాల్మీకి కులానికి ఎస్.టి జాబితాలో చేర్చినప్పుడే గిరిజన ప్రజలు మీకు సమాధి చేసారు. ఒకటి గుర్తుంచుకోండి పబ్లిసిటీ కోసం మీ వైసీపీ పార్టీ ప్రజ ధనాన్ని వృధాచేస్తూ స్టిక్కర్లు, గోడలకు మీ పార్టీ రంగులు వెయ్యడం కోసం వేలాది కోట్లు వృధాచేయ్యట్లేదా..?. గత ప్రభుత్వలా పాలనలో పింఛన్ అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పింఛన్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వ హయాంలో భూమి ఎక్కువ ఉందని, కార్డులో ఒక్కరికి మాత్రమే అని చాలా మందిని పింఛన్ పీకేయ్యడం జరగలేదా?. నాడు నేడు అని గొప్పలు చెప్పుకొనే మీకు గిరిజన గ్రామాలలో గుడసెలు కట్టుకొని పిల్లలకు విద్యా బోధన చేస్తున్న గ్రామాలు కోకొల్లలు. గిరిజన గ్రామాలకు గడప గడప అనుకుంటూ తిరిగి మీరు ఏమిసాదించారు?. ఆశ్రమ పాఠశాలలో గిరిజన పిల్లలు అనారోగ్యంతో చనిపోతే హెల్త్ అసిస్టెంట్, ఏ.ఎన్.ఎం లను నియమించే పరిస్థితి మీ ప్రభుత్వానికి లేక పోవడం ఛిగ్గు చేటు. ఇది వాస్తవం కాదంటారా?. చింతపల్లి మండలం, గొందిపాకలు పంచాయితీ, ఎర్రవరం గ్రామంలో హైడ్రో పవర్ ప్రొజెక్ట్ కోసం మీ ప్రభుత్వం దౌర్జన్యంగా అ పరిధిలో గ్రామాలు ఖాళీ చేసి ప్రాజెక్ట్ కట్టే దుస్థితిలో ఉన్న మీరు మీ నాయకులకు వత్తాసు పలికే పరిస్థితి. ఇలాంటి నీతిమాలిన పాలన చేసి గిరిజన ప్రజలకు అన్యాయం చేస్తే జనసేన పార్టీ చూస్తూ కూర్చోదు. గిరిజన ప్రజలకు ఏ అన్యాయం జరిగినా జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని జనసేన తరఫున హెచ్చరించారు.